Page Loader
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో విజృంభిస్తున్న బ్రంట్, మాథ్యూస్
మాథ్యూస్ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో విజృంభిస్తున్న బ్రంట్, మాథ్యూస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ తరుపున నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్ మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ విజృంభించడంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తన మూడవ అర్ధ సెంచరీని నమోదు చేసింది. వరుస విజయాలతో ఫ్లేఆఫ్స్‌కు చేరుకున్న మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ అవతరించింది. గుజరాత్ కెప్టెన్ స్నేహ్‌రాణా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ముంబై పవర్ ప్లేలో 31/1 స్కోరు చేసింది. మాథ్యూస్ ఔట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. తర్వాత నాట్ స్కివర్-బ్రంట్ (36), యస్తిక (44) రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు.

గుజరాత్

గుజరాత్‌ జెయింట్స్ ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం

హర్మన్‌ప్రీత్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసింది. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బ్రంట్, మాథ్యూస్ ఇద్దరూ నాలుగు ఓవర్లలో 25 పరుగుల కంటే తక్కువ పరుగులకే ఇచ్చారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేయడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. గుజరాత్ టైటాన్స్ నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములతో గుజరాత్‌ జెయింట్స్ ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.