యూపీ వారియర్స్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ సునామీ ఇన్నింగ్స్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. కేవలం 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 53 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 20 ఓవర్లలో 159/6 చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ స్కివర్-బ్రంట్ అజేయంగా 106 పరుగులు జోడించారు. దీంతో 18 ఓవర్లలో ముంబాయి లక్ష్యాన్ని చేధించింది. ఎనిమిదో ఓవర్‌లో స్కోరు 58/2 ఉన్నప్పుడు హర్మన్‌ప్రీత్ క్రీజులోకి వచ్చింది. హర్మన్‌ప్రీత్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తన రెండోవ అర్ధశతకాన్ని సాధించింది. ఆమె ఇప్పుడు మూడు ఇన్నింగ్స్‌లలో 129.00 సగటుతో 129 పరుగులకు చేరుకుంది.
హర్మన్ ప్రీత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
అదే సమయంలో యూపీ 4 మ్యాచ్‌ల్లో రెండో ఓటమిని చవిచూసింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ కెప్టెన్ అలిస్సా హీలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. హీలీతో పాటు, ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ కూడా తన రెండో అర్ధ సెంచరీని నమోదు చేసింది డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ముంబై లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్ మరోసారి తన సత్తా చాటి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు లెగ్ స్పిన్నర్ అమేలియా కర్ కూడా 2 వికెట్లతో రాణించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మన్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.