WPL 2023 : చెలరేగిన కెప్టెన్.. ముంబై ఇండియన్స్‌కు నాలుగో విజయం
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో ముందుకెళ్తోంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ అదరగోట్టారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీవారియర్స్ 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది. కెప్టెన్ అలీసా హేలీ (58), తహ్లీమా మెక్‌గ్రాత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముంబై బౌలర్లలో సాయిక్ ఇసాక్ మూడు, హేలీమాథ్యూస్ రెండు వికెట్లు తీశారు. హీలీ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 58 పరుగులు చేసింది. హీలీ వరుసగా 7, 24, 96*, 58 పరుగులు చేసింది. ఆమె ఈసీజన్‌లో 185 పరుగులు చేసింది. హీలీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు ప్లేయర్స్‌లో రెండోస్థానంలో ఉంది.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్
160 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు యస్తికా భాటియా (42), హేలీ మాథ్యూస్ (12) శుభారంభం ఇచ్చారు హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చే సరికి ముంబై ఇండియన్స్ స్కోర్.. 58\2. దాంతో, నాట్ సీవర్ బ్రంట్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ హర్మన్ ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్సర్‌తో 53 పరుగులు చేసింది. నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించింది. ముంబై జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 164 పరుగులు చేసింది. జట్టుకు అద్భుతమైన విజయం అందించిన కెప్టెన్ హర్మన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.