Page Loader
WPL : యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ వీర బాదుడు
96 పరుగులు చేసిన కెప్టెన్ హీలీ

WPL : యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ వీర బాదుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగోసారి ఆర్సీబీ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం యూపీ వారియర్స్ 13 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ అలీస్సా హీలీకి (96 నాటౌట్: 47 బంతుల్లో, 18 ఫోర్లు, ఒక సిక్సర్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. యూపీ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన నాలుగు పరుగులకే నిరాశపరిచింది.

హీలీ

96 పరుగులతో రాణించిన హీలీ

మరో ఓపెనర్ సోఫీ డివైన్, వన్ బౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (52: 39 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. జోరు మీదున్న సోఫీ డివైన్‌ను ఎకిల్ స్టోన్ పెవిలియన్ బాట పట్టించింది. హీలీ 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. పవర్‌ప్లే ఓవర్లలో ఆమె 38 పరుగులు చేసింది, మూడు మ్యాచ్‌ల్లో, హీలీ ఇప్పుడు 63.50 సగటుతో 127 పరుగులు చేశాడు. ఉమెన్స్ ప్రీమియర్ అత్యధిక వ్యక్తిగత స్కోరును హీలీ (96) నమోదు చేసింది. అంతకుముందు తహిలా మెక్‌గ్రాత్ 90 పరుగులు చేసింది.