ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో శిఖాపాండే శివంగిలా దుమ్ములేపుతోంది. తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై మూడు కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ప్రస్తుతం డీసీ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో శిఖా పాండే మూడు వికెట్లు తీయడం ఇదో రెండో సారి. గత మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 5.75 ఎకానమీతో 3 వికెట్లు తీసింది. ఆమె ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్మృతి మంధానను ఔట్ చేసి ఆర్సీబీకీ షాక్ ఇచ్చింది. అనంతరం సోఫీ డివైన్‌ను, రిచాఘోష్‌ను ఔట్ చేసి సత్తా చాటింది.
డబ్య్లూపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా శిఖాపాండే
2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శిఖాపాండే 62 టీ20 మ్యాచ్‌లను ఆడింది. ఇందులో 43 వికెట్లు పడగొట్టింది. 55 వన్డే మ్యాచ్‌లు ఆడి 21.92 సగటుతో 75 వికెట్లు తీసింది. అదే విధంగా వన్డేల్లో రెండు అర్ధ సెంచరీలను కూడా నమోదు చేసి, 512 పరుగులు చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో శిఖా పాండే ఐదు మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లను తీసింది. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచింది. ఆమె కంటే ముందు ముంబై ప్లేయర్ సైకా ఇషాక్ 12 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉంది.