Page Loader
WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి
చివరి ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2023
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన(8) విఫలమైనా. ఎల్లీస్ ఫఎర్రీ 67 పరుగులతో రాణించింది. క్యాపిటల్స్ తరఫున శిఖా పాండే మూడు వికెట్లతో సత్తా చాటింది. తారా నోర్రీస్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి విజయం సాధించింది.

ఆర్సీబీ

ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఆర్సీబీ

లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. మేగన్ స్కట్ బౌలింగ్‌లో పెఫాలీ వర్మ క్లీన్ బౌల్డ్ అయ్యి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది. అయితే క్రీజులోకి వచ్చిన అలీస్ క్యాపీ బౌండరీలతో విజృభించింది. అనంతరం అలీస్ క్యాపీ, కెప్టెన్ మెగల్ లాన్నింగ్(15), జెమీయా రోడ్రిగ్స్ (32) ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 18 బంతుల్లో ఢిల్లీ విజయానికి 24 పరుగులు అవసరమవ్వగా..రేణుకా సింగ్ వేసిన చివరి ఓవర్‌‌లో జొనాస్సెన్ 6, 4 బాది విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ ఇప్పటివరకూ ఒక మ్యాచ్‌ను కూడా గెలుపొందలేదు.