Page Loader
WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్

WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 13, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. మొదటి నాలుగు మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. వరుస పరాజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మహిళల ప్రీమియర్ లీగ్ 11వ మ్యాచ్‌లో ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్ తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలను సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ తరుపున కెప్టెన్ మెక్ లానింగ్, షాఫాలీ వర్మ అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ విజయానికి కృషి చేస్తున్నారు.

ఆర్సీబీ

ఢిల్లీపై బెంగళూర్ విజయం సాధించేనా..!

బెంగళూరు జట్టు నిండా స్టార్ బ్యాటర్లు, అంతర్జాతీయ ఆల్ రౌండర్లు, హిట్టర్లు ఉన్నా అవసరానికి జట్టును అదుకొనే వారే కరువయ్యారు. ఉమెన్స్ వేలంలో అత్యధిక ధర పలికిన స్మృతి మంధాన బ్యాటింగ్‌లో పూర్తిగా నిరాశపరుస్తోంది. ఢిల్లీతో నేడు జరిగే మ్యాచ్‌లోనైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు: మెగ్‌లానింగ్ (సి), షఫాలీ‌వర్మ, జెమిమారోడ్రిగ్స్, మారిజాన్‌కాప్, లారాహారిస్, జెస్ జొనాసెన్, మిన్నుమణి, తానియాభాటియా (WK), శిఖాపాండే, రాధా యాదవ్, తారా నోరిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు: స్మృతిమంధాన (సి), సోఫీడివైన్, ఎల్లీస్‌పెర్రీ, హీథర్ నైట్, ఎరిన్ బర్న్స్/డేన్ వాన్ నీకెర్క్, రిచా ఘోష్ (వారం), కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, కోమల్ జంజాద్, సహానా పవార్