ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా సత్యనాదేళ్ల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఫ్రాంచేజీలు విశ్వవాప్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించిన ఫ్రాంచేజీలు తాజాగా ఆమెరికాపై దృష్టి పెట్టాయి. ఐపీఎల్ తో పాటు ఐపీఎల్ దక్షిణాఫ్రికా,యూఏఈ, కరేబియన్ క్రికెట్ లీగ్‌లలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఫ్రాంచేజీలు తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కాలుమోపాయి. ఈ ఏడాది అమెరికా వేదికగా యూఎస్ఎ మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్‌సీ) లో ఆరు ఫ్రాంచేజీలు ఉండగా అందులో నాలుగు టీంలను ఐపీఎల్ ఓనర్లే దక్కించుకోవడం విశేషం. తాజాగా అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్‌లో టీంని సొంతం చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదేళ్లతో చేతులు కలిపింది.
సీటెల్ ఓర్కాస్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
సీటెల్ ఓర్కాస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని అయిన జీఎంఆర్ గ్రూప్ ప్రపంచ స్థాయి క్రికెట్ జట్టును తయారు చేయడంలో సాయం చేయడానికి సీటెల్ ఓర్కాస్‌తో భాగస్వామిగా ఉంటుందని మేజర్ లీగ్ క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. సియాటెల్ లో ఢిల్లీతో పాటు కో ఓనర్ గా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉండనున్నారు. ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది.