Page Loader
బైక్‌పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో వైరల్..!
శ్రీశాంత్, ఎంస్ ధోనీ

బైక్‌పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో వైరల్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో కూల్‌గా ఉండి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. మహికి కార్లు, బైకులు అంటే అమితమైన పిచ్చి. ముఖ్యంగా తన గ్యారేజీలో ఎన్నో స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. తాజాగా ధోనీ బైక్‌పై చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ధోనీకి ఖాళీ సమయం దొరికితే రాంచీ వీధుల్లో అప్పుడప్పుడు బైక్‌పై షికారుకెళ్తుంటారు. రోడ్లపై రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ సరదాగా గడుపుతుంటారు. మహి, టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌తో కలిసి సరదాగా బైక్ రైడ్‌ను ఎంజాయ్ చేశాడు. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తోంది. అయినా ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బైక్ నడుతుపున్న ఎంఎస్ ధోని