
ధోనీ వల్ల ఆ రెండు వరల్డ్ కప్‌లను గెలవలేదు.. యువరాజ్ వల్లే గెలిచాం : గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మరోసారి గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. 2007, 2011 విజయాలు కేవలం ధోనీ వల్లే సాధ్యమైనట్లుగా అతడి పీఆర్ టీమ్ జోరుగా ప్రచారం చేసిందని, నిజానికి ఆ రెండు విజయాల్లోనూ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడని గంభీర్ పేర్కొన్నారు.
2007, 2011 వరల్డ్ కప్ గురించి మాట్లాడినప్పుడు దురదృష్టవశాత్తు యువరాజ్ పేరును మరిచిపోతామని, ఇది కేవలం మార్కెటింగ్ అని, ఒక వ్యక్తిని మిగతా అందరి కంటే ఎక్కువ చూపించడం మంచిది కాదన్నారు.
ఇండియా వ్యక్తి పూజ చేసే దేశమని, దీంతో చాలా సంవత్సరాలుగా టీమిండియా ఐసీసీ ట్రోఫీలను గెలవడం లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Details
జట్టుకు బదులు ఆటగాడికి ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ కాదు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో వ్యక్తి కంటే జట్లే గొప్పవని, మన దేశంలో బ్రాడ్ కాస్టర్, మీడియా, అందరూ పీఆర్ ఏజెన్సీ స్థాయికి దిగజారానని, 2011లో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినా అతనికి క్రెడిట్ లభించలేదని గంభీర్ వెల్లడించారు.
అదే విధంగా 1983 వరల్డ్ కప్ మ్యాచులో అమర్ నాథ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. అయితే అందరూ కపిల్ దేవ్ ను గుర్తు పెట్టుకున్నారని, అప్పుడప్పుడు అమర్ నాథ్ ను కూడా చూపించాలని తెలియజేశాడు.
జట్టుకు బదులు ఆటగాడికి ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ కాదని సూచించాడు.