Virat Vs Gambhir: నా కళ్లకంటిన మట్టితో సమానం.. గొడవ ఇక్కడే మొదలైంది!
లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూర్ మ్యాచ్ అనంతరం గంభీర్-విరాట్ కోహ్లీల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగడమే కాక.. వారి ప్రవర్తనతో సహచర ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం నెట్టింట వీరద్దరి మధ్య జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ గొడవకు ప్రధానం కారణం ఎంటీ? ఎక్కడ నుంచి మొదలైంది? అనే విషయంపై మరో ఘటన వెలుగు చూసింది. మ్యాచ్ చివర్లో 16-17 ఓవర్ల మధ్య విరామ సమయంలో లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్, ఆర్సీబీ బౌలర్ సిరాజ్ మధ్య చిన్నపాటి గొడవ కారణంగానే గంభీర్, కోహ్లీ గొడవకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
మొదట సిరాజ్ తో గొడవ పడిన నవీన్
ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపు చేష్టలు చోటు చేసుకున్నాయి. 17 ఓవర్ వేసిన సిరాజ్ 5 బంతుల్లో 8 ఇచ్చాడు. చివరి బంతికి ఫ్రి హిట్ అయింది. అయితే నవీన్ ఆ బాల్ ను డాట్ చేశాడు. తర్వాత సిరాజ్, నవీన్ క్రీజులో ఉన్నా కూడా బంతిని వికెట్ కి విసిరాడు. దీంతో వీరి ఇద్దరి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకోవడంతో మిశ్రా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కోహ్లీ తన షూ డస్ట్ ని నవీన్ కి చూపిస్తూ నా కాళ్ల దుమ్ముతో సమానం అంటూ అగ్రెసివ్ అయ్యాడు. అయితే మైదానంలో జరిగిన గొడవపై గంభీర్, కోహ్లీతో గొడవకు దిగనట్లు తెలుస్తోంది.