Page Loader
సన్ రైజర్స్ పై ధోని ట్రాక్ రికార్డు ఇదే..
సన్ రైజర్స్ పై 488 పరుగులు చేసిన ధోని

సన్ రైజర్స్ పై ధోని ట్రాక్ రికార్డు ఇదే..

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ ఈ సీజన్ లో ఈ రెండు జట్లు ఐదేసి చొప్పున మ్యాచ్ లు ఆడాయి.ఇందులో సీఎస్కే మూడు విజయాలు సాధించగా.. సన్ రైజర్స్ రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది. అయితే సన్ రైజర్స్ కంటే సీఎస్కే బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని సన్ రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో సీఎస్కే విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే అవకాశం కూడా ఉంది.

Details

విజయంపై కన్నేసిన సీఎస్కే

అయితే సీఎస్కే కెప్టెన్ ధోనికి సన్ రైజర్స్ పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకూ సన్ రైజర్స్ పై ధోని 145.24 స్ట్రైక్ రేట్‌ తో 488 పరుగులు చేశాడు. ఆ జట్టుపై ధోని యావరేజ్ 48.80 గా ఉంది. ఇంకా 12 పరుగులు చేస్తే 500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. అయితే ధోనిని ఆరెంజ్ ఆర్మీ ఎంత వరకు కట్టడి చేస్తుందో వేచి చూడాలి. ఇప్పటివరకు 239 మ్యాచ్‌లను ఆడిన ధోనీ.. 5,037 పరుగులను పూర్తి చేశాడు.