Page Loader
ధోని, రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన ట్విట్టర్.. బ్లూటిక్ మాయం
బ్లూటిక్ కోల్పోయిన ధోని, కోహ్లీ

ధోని, రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన ట్విట్టర్.. బ్లూటిక్ మాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ క్రికెటర్ల ట్విట్టర్ ఖాతాల్లో గురువారం బ్లూటిక్ మాయమైంది. దీంతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న క్రికెటర్లు ట్విటర్ చర్యతో షాక్ కు గురవుతున్నారు. సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మల ఖాతాలో బ్లూటిక్ ను తొలగించారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఆకౌంట్లలో ప్రముఖుల పేర్ల మీద ఎన్నో అకౌంట్లు క్రియేట్ అవుతుంటాయి. వీటిలో ఒరిజినల్ ఏదో కనిపెట్టాలంటే బ్లూటిక్ కచ్చితంగా అవసరం. ట్విటర్ ను ఎలాన్ మాస్క్ కొనుగోలు చేయకముందు భారతీయ వినియోగదారులకు ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ ఉచితంగా బ్లూటిక్ అందించేది. అయితే ట్విటర్ ను సొంతం చేసుకున్న అనంతరం ఎలన్ మస్క్ నిబంధనలను పూర్తిగా మార్చేశాడు.

Details

బ్లూటిక్ కావాలంటే పేమెంట్ చేయాల్సిందే

ప్రస్తుతం బ్లూటిక్ కావాలంటే పేమెంట్ చేయాల్సిందేనని ఎలన్ మాస్క్ ప్రకటించాడు. సబ్‌ స్క్రైబ్‌ చేసుకోని వారి ఖాతాకు బ్లూటిక్‌ తొలగిస్తామని ఇటీవలే ట్విటర్‌ ప్రకటన జారీ చేసింది. దీంతో గురువారం నుండి ప్రముఖుల ఖాతాల నుండి బ్లూటిక్‌ మాయమైంది. ఈ బ్లూటిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాలని నిబంధన విధించారు. ఎంతటీ సెలబ్రిటీలు అయినా నెలవారీగా 8 డాలర్లు చెల్లించకపోతే బ్లూటిక్ ను తొలిగిస్తున్నారు. దీనిలో భాగంగానే క్రికెటర్లు కూడా బ్లూటిక్ ను కోల్పోయారు.