దటీజ్ రోహిత్ శర్మ.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్న కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి క్రీడాస్ఫూర్తిని చాటుకొని అందరి మనసులను గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 'మన్కడింగ్ రనౌట్' కు భారత బౌలర్ షమీ ప్రయత్నించగా.. వెంటనే కెప్టెన్ రోహిత్ నిరాకరించాడు. షమీచేత అప్పిల్ ను వెనక్కు తీసుకునేలా చేసి శబాష్ అనిపించుకున్నాడు.
శ్రీలంక కెప్టెన్ దసున్ శనక 98 పరుగులతో నాన్ స్ట్రైకర్ గా ఉండటంతో రోహిత్.. మన్కడింగ్ ఔట్ కు నిరాకరించారు. చివరి ఓవర్‌లో హిట్ మ్యాన్ దయతో బతికిపోయిన షనక కాసేపటికే సెంచరీ బాదాడు. శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది.
రోహిత్ శర్మ
అసలు ఏం జరిగిందంటే..?
శ్రీలంక ఇన్నింగ్స్‌లో షమీ ఆఖరి ఓవర్ వేశాడు. తొలి మూడు బంతులను ఆడిన షనక 2, 0, 1తో మూడు పరుగులు చేశాడు. నాలుగో బంతికి టెయిలెండర్ రజితా స్ట్రైకింగ్ రాగా.. 98 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్న షనక నాన్‌స్ట్రైకర్‌లో ఉన్నాడు.
షమి బంతిని వేయకముందే శనక క్రీజు వదిలి బయటికి వెళ్లాడు. వెంటనే షమీ బంతితో బెల్స్‌ను తాకాడు. ఇది ఓటా కాదా అని తెలుసుకోవడం కోసం థర్డ్ అంపైర్‌ని సంప్రదించాడు.
శనక సెంచరీకి మరో రెండు పరుగుల దూరంలో ఉండటంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ షమీతో మాట్లాడి రనౌట్ ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో స్ట్రైకింగ్ కు వచ్చిన శనక ఫోర్ బాది సెంచరీ పూర్తి చేశాడు.