IPL 2026: జరిమానాలు, నిషేధాలు.. ఆగని సెలబ్రేషన్స్.. రాఠీ స్టైల్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
నోట్‌బుక్ సెలబ్రేషన్స్ గుర్తున్నాయా? ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి ప్రత్యేకంగా ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకోవడమే అతని సిగ్నేచర్. గత ఏడాది ఐపీఎల్‌లో కూడా అతను అభిషేక్ శర్మతో కొంత ఘర్షణల పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అనేక సార్లు జరిమానా చెల్లించిన రాఠీ, ఒక మ్యాచ్‌లో సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశం అంతటా కూడా అదే శైలిలో వ్యవహరిస్తూ, వివాదాస్పదంగా మారాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లో ఆడుతున్న సందర్భంలో తన పంథాను మార్చనని రాఠీ స్పష్టం చేశాడు.
వివరాలు
సెలబ్రేషన్స్ ఎవరూ ఆపలేరు..
తాను ఎలాంటి ప్లేయర్‌ను కూడా అవమానించలేదని, ఆ ఉద్దేశం కూడా అది కాదని రాఠీ స్పష్టం చేశారు. తన సెలబ్రేషన్స్‌ను ఎవరూ ఆపలేరని, ప్రతి బ్యాటర్ సెంచరీ చేసిన తర్వాత హెల్మెట్‌ను బ్యాట్‌పై పెట్టి సెలబ్రేట్ చేస్తారు కదా అని వివరించారు. అలాగే తాను కూడా అందరితో సమానంగా తన సెలబ్రేషన్స్‌ను చేసుకుంటున్నట్లు తెలిపారు. రిషభ్ పంత్, మేనేజ్‌మెంట్ ఒక సూచన మాత్రమే ఇచ్చారని, తాను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసినా నిషేధం తప్పకుండా ఉండకూడదని చెప్పినట్లు రాఠీ తెలిపారు.
వివరాలు
భారీగా జరిమానాలు..నిషేధాలుఇలా..
ఒకే సీజన్‌లో మూడుసార్లు నియమ ఉల్లంఘనలందుకు రాఠీపై భారీ జరిమానా విధించబడింది. మొదట 25 శాతం జరిమానా, ఆ తరువాత రెండుసార్లు 50 శాతం ఫైన్ విధించబడింది. ఒక మ్యాచ్‌లో సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, రాఠీ ఖాతాలో డీమెరిట్ పాయింట్ కూడా నమోదు అయింది. నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు సమానం. 36 నెలల్లో 8 డీమెరిట్ పాయింట్లు సంపాదిస్తే రెండు మ్యాచ్‌లకు నిషేధం. 11 పాయింట్లు వస్తే మూడు మ్యాచ్‌లకు బ్యాన్ అవ్వవచ్చని నియమం ఉంది.