
Divya Deshmukh: ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్యా దేశ్‌ముఖ్
ఈ వార్తాకథనం ఏంటి
జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ అద్భుత విజయాన్ని సాధించింది. టైబ్రేకర్‌లో తన సహ భారత క్రీడాకారిణి కోనేరు హంపీపై గెలిచి ఆమె ఈ ప్రతిష్ఠాత్మక కప్‌ను అందుకుంది. మొదటి గేమ్‌ను డ్రాగా ముగించిన 19 ఏళ్ల దివ్య,రెండవ రాపిడ్ గేమ్‌లో విజయాన్ని నమోదు చేసింది. బ్లాక్ పావులతో ఆడుతున్న హంపీ ఒక్క చిన్న తప్పిదం చేయడంతో,దివ్య ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది.
వివరాలు
దివ్యకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్
ఈ ఒక్క దెబ్బతో ఆమె కీలక ఆధిపత్యాన్ని సంపాదించి విజయం వైపు సాగింది. ఈ విజయం ద్వారా దివ్య తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన గెలుపుని నమోదు చేసింది. అంతేకాకుండా, భారతదేశానికి నాల్గవ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయంతో దివ్యకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ కూడా లభించింది. కోనేరు హంపీ, ఆర్. వైశాలి, హారిక ద్రోణవల్లి తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న నాల్గవ భారత మహిళగా ఆమె చేరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్యా దేశ్‌ముఖ్
Divya Deshmukh beats Koneru Humpy in tiebreaks to become the FIDE Women's World Cup Champion 2025 - and become India's 88th Grandmaster!
— ChessBase India (@ChessbaseIndia) July 28, 2025
In the all-Indian Finals which went to tiebreaks, Divya defeated Humpy 1.5-0.5. The first Rapid game ended in a draw, and the next one Divya… pic.twitter.com/p5FP5BNzhd