Novak Djokovic : నెంబర్ స్థానానికి అడుగు దూరంలో నోవాక్ జొకోవిచ్
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోవడానికి సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆటగాడు ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. యూఎస్ ఓపెన్‌లో మొదటి రౌండ్‌లో విజయం సాధిస్తే నోవాక్ జొకోవిచ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ కు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో అందరి దృష్టి పురుషుల సింగిల్స్ పైనే ఉంది. ప్రస్తుతం నెంబర్ స్థానంలో ఉన్న కార్లోస్ అల్కరాజ్ కు అధిగమించడానికి జకొవిచ్ 20 పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ర్యాంకర్ 84వ ర్యాంక్ ఆటగాడు అలెగ్జాండ్రే ముల్లర్‌తో జకొవిచ్ తలపడనున్నాడు.
కార్లోస్ అల్కరాజ్ నుంచి జొకోవిచ్ కు గట్టి పోటీ
కోవిడ్ టీకా వేసుకొని కారణంగా గతేడాది జొకోవిచ్ యూఎస్ ఓపెన్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలను సడలించడంతో జకోవిచ్ ఈసారి యూఎస్ ఓపెన్ లో బరిలో దిగుతున్నాడు. జకోవిచ్ ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరేట్ కోర్టు( ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేయనున్నాడు. ఈ ఏడాది ప్రెంఛ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో టైటిల్ నెగ్గి, వింబుల్డన్ టోర్నీ పైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిపోయిన జొకోవిచ్ కు ఈ సారి కూడా ఈ స్పెయిన్ స్టార్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.