క్వెంటిన్ హాలీస్‌ను ఓడించిన నోవాక్ జొకోవిచ్
అడిలైడ్‌లో క్వెంటిన్ హాలీస్‌ను నోవాక్ జొకోవిచ్ ఓడించి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గురువారం హాలీస్‌ను 7-6(3), 7-6(5)తో పోరాడి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు నోవాక్ జొకోవిచ్.. 57 నిమిషాలు పాటు ఇద్దరు హోరాహోరీగా పోరాడాడు. భీకర ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ అద్భుతమైన షాట్లతో హాలీస్‌ను గెలుపొందాడు. ఈరోజు తన ప్రత్యర్థి నుంచి గొప్ప ప్రదర్శన చూశానని, హాలీస్ పోరాటం అద్భుతమని, తనని అభినందించాలని ఉందని జొకోవిచ్ చెప్పాడు. టాప్ 10 ఆటగాడిపై విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉందని, ఆట సాగినంతవరకు మంచి అనుభూతిని పొందానని, ప్రస్తుతం కఠినమైన సవాల్‌ను అధిగమించానని జొకొవిచ్ స్పష్టం చేశారు.
21 మ్యాచ్‌లో 20 విజయాలు
హాలీస్ గొప్ప ఆటగాడిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి గేమ్‌లో 5-2 గొప్పగా ఆడాడు. అయితే జొకోవిచ్‌ను ఓడించడానికి తీవ్రంగా పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. జొకోవిచ్ చివరి 21 మ్యాచ్‌లో 20 మ్యాచ్‌లు గెలిచాడు. 2007లో మూడో టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌కు వెళ్లిన జొకోవిచ్ శుక్రవారం షాపోవలోవ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. శనివారం డేనియల్ మెద్వెదేవ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ మాజీ నంబర్ 1 ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ బుధవారం అడిలైడ్ ఇంటర్నేషనల్ క్వార్టర్ ఫైనల్స్‌లో 6-0, 6-3 స్కోరుతో దేశస్థుడు మియోమిర్ కెక్‌మనోవిక్‌ను ఓడించాడు.