IND vs NZ: ఇంగ్లండ్‌తో డూ ఆర్ డై పోరు.. కివీస్‌కు అసలైన పరీక్ష!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో సెమీఫైనల్ బెర్తుపై న్యూజిలాండ్ జట్టు కన్నేసింది. శుక్రవారం జరిగే కీలక పోరులో కివీస్ జట్టు, ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్‌కు అర్హత సాధించగా, రెండో బెర్తును దక్కించుకోవాలని న్యూజిలాండ్ కృతనిశ్చయంతో ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ సేనను మిచెల్ శాంట్నర్ నాయకత్వంలోని కివీస్ ఎలా అడ్డుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్ నేరుగా సెమీస్ టికెట్ ఖాయం చేసుకుంటుంది.
Details
రెండోస్థానంలో కివీస్
అయితే ఓటమి ఎదురైనా అవకాశాలు పూర్తిగా ముగియవు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న కివీస్ భారీ తేడాతో ఓడిపోకుండా ఉంటే సరిపోతుంది. వారి మెరుగైన నెట్ రన్‌రేట్ (3.050) ఇందుకు ప్రధాన కారణం. ఇక గ్రూప్-2లో చివరి సూపర్-8 మ్యాచ్ శనివారం జరుగనుంది. ఆ పోరులో పాకిస్థాన్ జట్టు (1 పాయింట్)తో శ్రీలంక (0 పాయింట్లు) తలపడనున్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడినా, శ్రీలంకపై పాకిస్థాన్ (-0.461) భారీ విజయాన్ని నమోదు చేయకపోతే, ముఖ్యంగా శ్రీలంక (-2.800)పై గణనీయమైన రన్‌రేట్ మెరుగుదల సాధించకపోతే, సెమీఫైనల్ బెర్తు న్యూజిలాండ్‌కే దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి.