LOADING...
IPL Playoffs : సీఎస్కే, రాజస్థాన్‌కు డూ ఆర్ డై.. ప్లేఆఫ్స్ సమీకరణాలు మారిపోయాయ్!
సీఎస్కే, రాజస్థాన్‌కు డూ ఆర్ డై.. ప్లేఆఫ్స్ సమీకరణాలు మారిపోయాయ్!

IPL Playoffs : సీఎస్కే, రాజస్థాన్‌కు డూ ఆర్ డై.. ప్లేఆఫ్స్ సమీకరణాలు మారిపోయాయ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర లీగ్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ ముగియడానికి మరో రెండు వారాల సమయం కూడా లేకపోయినా, ఇప్పటివరకు ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. ప్రతి మ్యాచ్‌తో పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారిపోతుండటంతో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలవడంతో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం మూడు జట్లు దాదాపు 80 శాతం అవకాశాలతో ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తుండగా, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మాత్రం గండం గట్టెక్కేందుకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు

ఈ మూడు జట్లు ఫ్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు

ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ల అంచనాల ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు జట్లు ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 14పాయింట్లతో సమంగా నిలిచాయి. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కదానిలో గెలిచినా 16పాయింట్ల మార్క్‌ను చేరుకుంటాయి. అందుకే ఈ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు 80శాతానికి పైగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి మాత్రం క్లిష్టంగా మారింది. గత సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే, అలాగే వైభవ్ సూర్యవంశీ ఫామ్‌తో మంచి ఊపు మీదున్న రాజస్థాన్ ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.

వివరాలు

మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిలో గెలవాలి

సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు 42.7 శాతంగా ఉండగా, రాజస్థాన్ అవకాశాలు 41.8 శాతంగా అంచనా వేశారు. ఈ రెండు జట్లు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిలో గెలవాల్సిందే. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. ఢిల్లీపై గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, ఫీల్డింగ్ మరియు బౌలింగ్ లోపాలు ఆ జట్టును ఓటమి వైపు నెట్టాయి. ప్రస్తుతం పంజాబ్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 62.5 శాతంగా ఉన్నాయి.

Advertisement

వివరాలు

ముంబై, లక్నో అవుట్

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కేవలం 1.2 శాతం అవకాశాలు మాత్రమే ఉండగా, కేకేఆర్ అవకాశాలు 11.6 శాతంగా ఉన్నాయి. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ రెండు జట్ల పరిస్థితి దాదాపు క్లిష్టంగానే కనిపిస్తోంది. ఇక ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇదిలా ఉంటే, 2022 నుంచి ఐపీఎల్ 10 జట్ల టోర్నీగా మారిన తర్వాత ప్లేఆఫ్స్ అర్హత కోసం 16 పాయింట్లు కనీస లక్ష్యంగా మారాయి. గత మూడు సీజన్లలో నాలుగో స్థానంలో నిలిచిన ప్రతి జట్టూ 16 పాయింట్లతోనే క్వాలిఫై అయింది.

Advertisement

వివరాలు

14 పాయింట్లతో ఆర్సీబీ ముందంజ

కేవలం 2024 సీజన్‌లో మాత్రమే నెట్ రన్‌రేట్ ఆధారంగా 14 పాయింట్లతో ఆర్సీబీ ముందంజ వేసింది. ఈ సీజన్‌లో కూడా 16 పాయింట్లు సాధించిన జట్లు దాదాపు సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ కొన్ని జట్లు 14 పాయింట్ల వద్దే ఆగిపోతే, అప్పుడు నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించనుంది.

Advertisement