LOADING...
IPL 2026: చెపాక్‌లో డూ ఆర్ డై మ్యాచ్.. గెలిచేదెవరు, ప్లేఆఫ్స్‌కు దగ్గరవేదెవరు?
చెపాక్‌లో డూ ఆర్ డై మ్యాచ్.. గెలిచేదెవరు, ప్లేఆఫ్స్‌కు దగ్గరవేదెవరు?

IPL 2026: చెపాక్‌లో డూ ఆర్ డై మ్యాచ్.. గెలిచేదెవరు, ప్లేఆఫ్స్‌కు దగ్గరవేదెవరు?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2026
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఒక ప్లేఆఫ్ బెర్తు ఖరారవగా, మిగిలిన మూడు స్థానాల కోసం ఐదు జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల ఫలితాలతో పాయింట్ల పట్టికలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో ప్లేఆఫ్స్ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిస్తే టాప్-2లో స్థానం ఖాయం కానుంది.

వివరాలు

మూడో స్థానంలో హైదరాబాద్

ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలో 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కేకేఆర్ తరుపున 11 పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటీవల బెంగళూరు చేతిలో పంజాబ్ ఓడిపోవడం, ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు గణనీయంగా మారాయి. ఇప్పటికే అర్హత సాధించిన ఆర్సీబీని పక్కన పెడితే, గుజరాత్ టైటాన్స్ నాకౌట్ దశకు చేరే అవకాశాలు 99.20 శాతంగా ఉన్నాయి.

వివరాలు

ఐదో స్థానంలో సీఎస్కే

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 75 శాతం అవకాశాలు ఉండగా, పంజాబ్ కింగ్స్ అవకాశాలు 31.10 శాతంగా ఉన్నాయి. రాజస్థాన్, పంజాబ్ ఓటముల కారణంగా సీఎస్‌కే అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ప్రస్తుతం చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు 35.50శాతంగా ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు 10.60 శాతం, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 13.90 శాతం అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు జట్లు నాకౌట్‌కు చేరితే అది పెద్ద అద్భుతంగానే భావించాల్సి ఉంటుంది. ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లూ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ మూడో స్థానంలో ఉండగా, సీఎస్‌కే ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

వివరాలు

సీఎస్కే విజయం సాధిస్తే 14 పాయింట్లు

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధిస్తే జట్టు ఖాతాలో 14పాయింట్లు చేరతాయి. దీంతో చెన్నై టాప్-4లోకి ఎంట్రీ ఇస్తుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ఐదో స్థానానికి పడిపోతుంది. అలాగే టాప్-2లో ఆర్సీబీ స్థానం కూడా ఖరారవుతుంది. ఇక మే 21న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సీఎస్‌కే గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొననుంది. ఆ మ్యాచ్‌లో కూడా చెన్నై గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు దాదాపు ఖాయం అవుతుంది. అయితే ఆ సమయంలో గుజరాత్‌కు ఒత్తిడి పెరగనుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటైనా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండు మ్యాచ్‌లూ గెలిస్తే నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించనుంది.మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ సీఎస్‌కేపై గెలిస్తే రెండో స్థానంలోకి చేరుతుంది.

Advertisement

వివరాలు

రాజస్థాన్ ఓడితే అవకాశాలుండవు

దాంతో దాదాపు ప్లేఆఫ్ బెర్తు ఖాయమైనట్లే. అనంతరం మే 22న ఆర్సీబీతో జరిగే చివరి మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే టాప్-2లోకి దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ సీఎస్‌కేతో ఓడిపోయినా, ఆర్సీబీపై గెలిస్తేనే హైదరాబాద్ అవకాశాలు బలంగా నిలుస్తాయి. ఇక ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పుడు మిగతా జట్లకు ప్రమాదకరంగా మారాయి. ఈ రెండు జట్లూ ఇంకా రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ భవితవ్యం ఇప్పుడు ఈ రెండు జట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా రాజస్థాన్ ఇంటిబాట పట్టే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా తమ చివరి మ్యాచ్‌లో లఖ్‌నవూతో తలపడాల్సి ఉంది.

Advertisement