LOADING...
Rohit Sharma: విజయ్‌ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ.. ఎన్ని మ్యాచులు ఆడతాడో తెలుసా?
విజయ్‌ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ.. ఎన్ని మ్యాచులు ఆడతాడో తెలుసా?

Rohit Sharma: విజయ్‌ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ.. ఎన్ని మ్యాచులు ఆడతాడో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ హజారే ట్రోఫీ డిసెంబర్‌ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో రోహిత్‌ శర్మ ముంబయి తరపున రెండు మ్యాచ్‌లలో ఆడనున్నట్లు సమాచారం. అయితే ముంబయి జట్టుకు చెందిన పలువురు సీనియర్‌ ఆటగాళ్లు ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, అజింక్య రహానే, శివమ్‌ దూబె తదితరులు తొలి మ్యాచ్‌లకు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్‌ ప్రస్తుతం గ్యాస్ట్రిటిస్‌ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయంపై ముంబయి చీఫ్‌ సెలక్టర్‌ సంజయ్‌ పాటిల్‌ ఒక వార్తా సంస్థకు వివరాలు వెల్లడించారు. జైస్వాల్‌, దూబె, రహానే మొదటి రెండు మ్యాచ్‌లకు ముంబయి జట్టులో ఉండరు. సెలక్షన్‌ ప్యానల్‌ యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వనుంది.

Details

దిల్లీ తరుపున బరిలోకి విరాట్ కోహ్లీ

యశస్వి జైస్వాల్‌ ఉదర సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ గ్రూప్‌లో ముంబయితో పాటు పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌ జట్లు ఉన్నాయి. ముంబయి తన తొలి మ్యాచ్‌ను డిసెంబర్‌ 24న సిక్కింతో sఆడనుంది. ఇక దిల్లీ జట్టుకు రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే విరాట్‌ కోహ్లీ కూడా దిల్లీ జట్టు తరపున విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొననున్నాడు. ఈ టోర్నీ మ్యాచ్‌లు డిసెంబర్‌ 24 నుంచి జనవరి 8 వరకు అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, జైపుర్‌ వేదికలుగా జరుగనున్నాయి. ఇక నాకౌట్‌ మ్యాచ్‌లను జనవరి 12 నుంచి జనవరి 18 వరకు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మైదానంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement