
IND vs AUS : ఈ నెల 19 నుంచి భారత్,ఆసీస్ వన్డే సిరీస్.. మ్యాచ్‌ల టైమింగ్,షెడ్యూల్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో 2-0 తేడాతో విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ (IND vs AUS) పై పడింది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అక్టోబర్ 19 (ఆదివారం) నుంచి ప్రారంభమవుతుంది. భారత జట్టు, శుభమన్ గిల్ నేతృత్వంలో, బుధవారం ఆస్ట్రేలియాకు బయల్దేరింది. ఇప్పటికే టీ20లు,టెస్టు క్రికెట్ నుండి రిటైర్ అయిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
వివరాలు
ఎక్కడ చూడాలంటే..?
ఇది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్-కోహ్లీ జంట ఆడే తొలి సిరీస్. ఈ సిరీస్‌లో రాణించకుంటే వారి వన్డే భవిష్యత్తు ప్రశ్నార్థకమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు ఎలా ఆడతారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. టీవీ ద్వారా, మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. అలాగే జియో హాట్ స్టార్ ఓటీటీ ద్వారా కూడా వీటిని స్ట్రీమ్ చేయవచ్చు. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చూడటానికి సబ్‌స్క్రిప్షన్ అవసరం. జియో మొబైల్ వినియోగదారులు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్ల ద్వారా జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
వివరాలు
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
భారత్ దేశం వెలుపల జరగే మ్యాచ్‌లు డీడీ స్పోర్ట్స్ (దూరదర్శన్) చానెల్‌లో ఉచితంగా ప్రసారం అవుతాయి. అయితే, కేబుల్ లేదా డీటీహెచ్ ద్వారా వీటిని ఉచితంగా చూడలేరు. భౌతిక (terrestrial) నెట్‌వర్క్ కనెక్షన్ ద్వారా మాత్రమే డీడీ స్పోర్ట్స్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ.
వివరాలు
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి వన్డే - అక్టోబర్ 19 - పెర్త్ వేదికగా రెండో వన్డే - అక్టోబర్ 23 - అడిలైడ్ వేదికగా మూడో వన్డే - అక్టోబర్ 25 - సిడ్నీ వేదికగా ఈ మూడు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి.