IND-W vs SA-W : భారత్, దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్‌కు డర్బన్ వేదికగా నిలుస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భారత్ యాజమాన్యం భావిస్తోంది. అలాగే ఈ సిరీస్ ద్వారా అన్ని ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి, జట్టు కూర్పును పరీక్షించాలని టీమ్ ప్లాన్ చేసింది. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా 22 ఏళ్ల ఆల్‌రౌండర్ అనుష్క శర్మ నిలిచింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఎలా రాణిస్తుందో అన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
వివరాలు
సిరీస్ షెడ్యూల్ ఇదే..
దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు లారా వోల్వార్డ్ నాయకత్వం వహించనుండగా, భారత మహిళల జట్టును హర్మన్‌ప్రీత్ కౌర్ నడిపించనున్నారు.
తొలి టీ20 మ్యాచ్ - ఏప్రిల్ 17 - కింగ్స్‌మీడ్, డర్బన్
రెండో టీ20 మ్యాచ్ - ఏప్రిల్ 19 - కింగ్స్‌మీడ్, డర్బన్
మూడో టీ20 మ్యాచ్ - ఏప్రిల్ 22 - వాండరర్స్ స్టేడియం, జోహానెస్‌బర్గ్
నాలుగో టీ20 మ్యాచ్ - ఏప్రిల్ 25 - వాండరర్స్ స్టేడియం, జోహానెస్‌బర్గ్
ఐదో టీ20 మ్యాచ్ - ఏప్రిల్ 27 - విల్లోమూర్ పార్క్, బెనోని
వివరాలు
భారత మహిళల జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్),
స్మృతి మంధాన (వైస్ కెప్టెన్),
షఫాలీ వర్మ,
జెమీమా రోడ్రిగ్స్,
దీప్తి శర్మ,
రిచా ఘోష్ (వికెట్ కీపర్),
అరుంధతి రెడ్డి,
రేణుకా ఠాకూర్,
క్రాంతి గౌడ్,
శ్రీ చరణి,
శ్రేయాంక పాటిల్,
కష్వీ గౌతమ్,
భారతీ ఫుల్మాలి,
ఉమా చెత్రీ (వికెట్ కీపర్),
అనుష్క శర్మ.
వివరాలు
మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి?
ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతాయి.
దక్షిణాఫ్రికాలో సూపర్ స్పోర్ట్స్ క్రికెట్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
అలాగే సూపర్ స్పోర్ట్స్ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లో కూడా వీక్షించవచ్చు.
భారతదేశంలో ఈ సిరీస్ ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు ఉన్నాయి కాబట్టి టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో మ్యాచ్‌లను చూడవచ్చు.
ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కోసం జియో హాట్‌స్టార్‌లో కూడా ఈ మ్యాచ్‌లు అందుబాటులో ఉంటాయి.