Page Loader
5బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన రీకూసింగ్ ఎవరో తెలుసా!
5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన రీకూసింగ్

5బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన రీకూసింగ్ ఎవరో తెలుసా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2023
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో చాలా అరుదుగా ఆరు బంతుల్లో ఆరు సిక్సలు కొట్టడం మనం చూశాం. ఇప్పటికే ఈ రికార్డు రవిశాస్త్రి, యువరాజ్‌సింగ్, హర్షల్‌గిబ్స్ సాధించారు. కానీ భారీ స్కోరును చేధించే క్రమంలో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడం అనేది చాలా అరుదైన విషయం 2016 లో కార్లోస్ బ్రాత్‌వైట్ ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ రికార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐపీఎల్ కోల్ కత్తా ప్లేయర్ రీకూ సింగ్ చివరి ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. రీకూసింగ్ తండ్రి ఎల్‌పిజి సిలిండర్‌లను హోమ్ డెలివరీ చేసే పనిచేస్తుండగా.. అతని అన్నయ్య ఆటో నడుపుకుంటున్నాడు. రింకూ తొమ్మిదో తరగతితో చదువు ఆపేశాడు.

రీకూసింగ్

ఒకానొక సమయంలో స్వీపర్‌గా పనిచేసిన రీకూసింగ్

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన రీకూసింగ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఒకానొక సమయంలో రీకూ స్వీపర్ గా కూడా పనిచేశాడు. 2018లో జరిగిన IPL వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 80 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. తన తండ్రి ఎంతో కష్టపడ్డాడని, తాను కొట్టిన ప్రతి సిక్సర్ క్రికెట్ ను స్ఫూర్తిగా తీసుకున్న ఎంతోమందికి అంకితం చేస్తున్నానని రీకూసింగ్ చెప్పారు. కేకేఆర్ సారథి నితీష్ రాణా మాట్లాడుతూ రీకూసింగ్ అద్భుతం చేశాడని, ఇలాంటి ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుటుంబ సభ్యులతో రీకూసింగ్