
స్పిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ విలవిల.. కోల్‌కతా భారీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో సిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ కుప్పకూలింది. దీంతో ఆర్సీబీపై కోల్‌కతా 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.
లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీకి కోల్‌కత్తా బౌలర్లు చుక్కలు చూపించారు. సునీల్ మొదట విరాట్ కోహ్లీని బౌల్డ్ చేయగా.. ఫాఫ్ డుప్లిసెస్‌ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు.
8 ఓవర్లలో 54 పరుగులకే 4వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆర్సీబీ బ్యాటర్ల నడ్డివిరిచారు. వరుణ్‌చక్రవర్తి నాలుగు వికెట్లు, సుయేష్‌శర్మ 3 వికెట్లు, సునీల్‌నరైన్ రెండు వికెట్ల తీసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఆర్సీబీ
స్పిన్నర్ల దెబ్బకు తలవంచిన ఆర్సీబీ టాప్ ఆర్డర్
మాక్స్ వెల్ (5), హర్షద్ పటేల్(0), అహ్మద్(1), దినేష్ కార్తీక్(9) రావత్(1) పరుగులతో పూర్తిగా నిరాశపరిచారు.
నిర్ణీత 17.4 ఓవర్లలో 123 పరుగులు చేసి బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఆలౌటైంది.
మొదట కోల్‌కతా బ్యాటర్ శార్దుల్ ఠాకూర్ 29 బంతుల్లో (9ఫోర్లు, 3 సిక్సర్లు) 68 పరుగులతో విజృంభించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది.
కోల్‌కతా బౌలర్లలో డేవిడ్ విల్లి, కరణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. బ్రాస్ వెల్, హర్షద్ పటేల్ తలో ఒక వికెట్ తీశారు.