Page Loader
శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం
29 బంతుల్లో 68 పరుగులు చేసిన శార్దుల్ ఠాకూర్

శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
09:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్ కతా ఈడెన్ గార్డన్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన కోల్‌కతా ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, రాహంతుల్లా గుర్బాజ్ శుభారంభాన్ని అందించలేదు. వెంకటేష్ అయ్యర్ (3) పరుగులకే వెనుతిరిగాడు. అయితే రహంతుల్లా గుర్భాజ్ 44 బంతుల్లో 57 పరుగులతో చెలరేగాడు. అనంతరం కరణ్ శర్మ బౌలింగ్‌లో గుర్బాజ్ ఔట్ అయ్యాడు. మన్‌దీప్‌సింగ్, నితీష్ రాణాను వరుస బంతుల్లో డేవిడ్ విల్లి ఔట్ చేయడంతో కోల్ కతా కష్టాల్లో పడింది. విధ్యంసక ఆటగాడు అండ్రూ రస్సెల్ డకౌట్ నిరాశపరిచాడు. 11.5 ఓవర్లల్లో 89 పరుగులు కోల్ కత్తా ఐదు వికెట్లు కోల్పోయింది

కోల్‌కతా

204 పరుగులు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

అనంతరం క్రీజులో దిగిన రీకూసింగ్, శార్దుల్ ఠాకూర్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రీకూసింగ్(46) ఫర్వాలేదనిపించాడు. శార్దుల్ ఠాకూర్ 29 బంతుల్లో (9ఫోర్లు, 3 సిక్సర్లు) 68 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో డేవిడ్ విల్లి, కరణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. బ్రాస్ వెల్, హర్షద్ పటేల్ తలో ఒక వికెట్ తీశారు.