Page Loader
IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా?
నేడు ఆర్సీబీతో తలపడనున్న కేకేఆర్

IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా నైట్ రైడర్స్ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్ లో నేడు మ్యాచ్ ఆడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. గతంలో ఆర్సీబీపై విధ్వంసం సృష్టించిన ఆండ్రీ రస్సెల్ తిరిగి అదే ఫామ్‌ను నేడు కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి. ఆర్సీబీ 13 మ్యాచ్‌లు ఆడిన ఆండ్రీ రస్సెల్ 43.88 సగటుతో 395 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 207.89గా ఉంది. ఇందులో ఒక హఫ్ సెంచరీని నమోదు చేశాడు. బౌలింగ్ విభాగంలో 9.94 ఎకానమీ రేటుతో 10 వికెట్లు తీశాడు.

ఆండ్రీ రస్సెల్

100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆండ్రీ రస్సెల్

ఆరుసార్లు ఆర్సీబీపై రస్సెల్ 35 కంటే ఎక్కువ పరుగులను చేశాడు. అతని స్కోర్లు వరుసగా 65 (25), 48* (13), 45 (17), 41* (17), 39 (19*), 39 (24) ఉన్నాయి. 2019లో ఆర్సీబీ, కేకేఆర్ పై 206 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన కేకేఆర్ 16 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక ఆర్సీబీ విజయం ఖాయం అనుకున్న సందర్భంలో ఆండ్రీ రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 13 బంతుల్లో 48 పరుగులు జట్టుకు విజయాన్ని అందించారు. చివరి తొమ్మిది బంతులను 6,6,6,1,6,6,6,4, 6 గా మలిచాడు. నేడు ఐపీఎల్‌లో అండ్రీరస్సెల్ 100వ మ్యాచ్‌ను ఆడబోతున్నాడు. 99 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 2,070 పరుగులు చేశాడు.