Page Loader
కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా?
కేకేఆర్ ఆటగాడు అండ్రూ రస్సెల్

కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నేడు ఈడెన్ గార్డన్స్‌లో కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిపోయిన కేకేఆర్.. సొంతమైదానంలో బెంగళూరును చిత్తుగా ఓడించాలని గట్టి పట్టులదతో ఉంది. ఈడెన్ గార్డన్స్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అదే విధంగా ఈ మైదానంలో స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. కేకేఆర్ ఈ మైదానంలో 74 మ్యాచ్‌లను ఆడింది. ఇందులో 45 సార్లు విజేతగా నిలిచింది. మరే ఏ ఇతర జట్టు ఈ మైదానంలో ఇన్ని విజయాలను నమోదు చేయలేదు.

కేకేఆర్

కేకేఆర్, ఆర్సీబీ జట్టులోని ఆటగాళ్లు

ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియంలో 43 విజయాలు, చెన్నై సూపర్ కింగ్స్ MA చిదంబరం స్టేడియంలో 41 విజయాలను నమోదు చేశాయి. ఈ మైదానంలో 78 మ్యాచ్ లు జరగ్గా.. ఛేజింగ్ జట్లు 48 సార్లు గెలుపొందాయి. 2017లో ఆర్సీబీని 49 పరుగులకే కేకేఆర్ ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. కేకేఆర్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (wk), వెంకటేష్ అయ్యర్, N జగదీశన్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, టిమ్‌సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి ఆర్సీబీ జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, బ్రేస్‌వెల్, దినేష్‌కార్తీక్ (వికె), షాబాజ్అహ్మద్, డేవిడ్‌విల్లీ, కర్ణ్‌శర్మ, హర్షల్‌పటేల్, ఆకాష్‌దీప్, సిరాజ్