Page Loader
జోరుమీదున్న బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్‌కు బిగ్‌షాక్
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన టాప్లీ

జోరుమీదున్న బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్‌కు బిగ్‌షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2023
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 16వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన ఆ జట్టుకు రెండో మ్యాచ్ ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆర్సీబీ జట్టు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. దీంతో అతని ఎడమ భూజానికి గాయమైంది. ఆ తర్వాత జట్టు ఫిజియోతో మాట్లాడిన తర్వాత మైదానం నుంచి బయటికెళ్లాడు. ముందుకు డైవ్ చేసే క్రమంలో టాప్లీ పక్కటెముకకు గాయమైందని ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి. టాప్లీ తర్వాతి మ్యాచ్ ఆడతాడా లేదా అన్న విషయంపై ఆ జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్పందించాడు.

దినేష్ కార్తీక్

టాప్లీ త్వరగా కోలుకుంటాడు: దినేష్ కార్తీక్

ముంబై మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్ జియో సినిమాతో మాట్లాడుతూ టాప్లీ భూజానికి గాయమైందని, ప్రస్తుతం అతన్ని స్కానింగ్‌కు తీసుకెళ్లారని, దీనిపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదన్నారు. టాప్లీ తిరిగి జట్టులో చేరుతాడని తాను అనుకుంటున్నానని, అయితే టాప్లీ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని దినేష్ కార్తీక్ వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో రీస్ టాప్లీ 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి కేమరూన్ గ్రీన్ రూపంలో భారీ వికెట్ కూడా తీశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ.. తమ తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 6న కోల్‌కతాతో ఆడనుంది.