Page Loader
విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థుల గుండెల్లో దడ: క్రిస్‌గేల్
విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన క్రిస్‌గేల్

విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థుల గుండెల్లో దడ: క్రిస్‌గేల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2023
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయంతో ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ 49 బంతుల్లో (6 ఫోర్లు, 5 సిక్సర్లు) 82 పరుగులు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 43 బంతుల్లో (5 ఫోర్లు, 6 సిక్సర్లు) 73 పరుగులతో చెలరేగడంతో మ్యాచ్ వన్ సైడ్‌గా మారింది. 2016 ఐపిఎల్ ఎడిషన్‌లో కోహ్లీ 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్ ఒకే సీజన్‌లో ఇంతవరకు 900 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు.

క్రిస్‌గేల్

విరాట్, డుప్లిసెస్ ఇన్నింగ్స్‌పై క్రిస్‌గేల్ హార్షం

విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడంపై ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్‌గేల్ స్పందించాడు. విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడని, 2016లో కోహ్లీ ఏ విధంగా సంచలనం సృష్టించాడో.. ఈ సీజన్‌లో అలాంటి రికార్డులనే నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక బౌలర్లకు కోహ్లీ చుక్కలు చూపిస్తాడని, మరోవైపు ఫాఫ్ కూడా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడని, విరాట్, ఫాఫ్ ఇద్దరు కలిసి ఈ సీజన్‌లో మరింత గొప్పగా రాణిస్తారని క్రిస్ గేల్ వివరించారు. తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 6న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.