ఐపీఎల్‌లో తొలి భారతీయ క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ సంచలన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్‌లోనే విజృంభించాడు. మొత్తం ఆరు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
దీంతో ఓ ఆరుదైన రికార్డును కోహ్లీ తన పేరిట రాసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో 50 సార్లు 50ప్లస్ స్కోరు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సంచలన రికార్డును సృష్టించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ వార్నర్ 60సార్లు 50ప్లస్ చేసి అగ్రస్థానంలో ఉండగా.. పంజాబ్‌కింగ్స్ కెప్టెన్ శిఖర్‌ధావన్ 49సార్లు 50ప్లస్ చేసి మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఐపీఎల్‌లో 45 అర్ధసెంచరీలు, 5సెంచరీలను బాదాడు.
నిన్న జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, డుప్లెసిస్ 148 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 22 బంతులు మిగిలి ఉండగానే బెంగళూర్.. ముంబైపై విజయం సాధించింది.
కోహ్లీ
ఆర్సీబీ తరుపున 3వేల పరుగులు చేసిన కోహ్లీ
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇందులో తిలక్ వర్మ 46 బంతుల్లో 84 పరుగులు చేసి విజృంభించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (1) పూర్తిగా నిరాశపరిచాడు.
15 ఓవర్లలో డు ప్లెసిస్ ఔటైన తర్వాత కోహ్లి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఒక ఫోర్, ఓ సిక్సర్ కొట్టి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 41 సార్లు 50+ స్కోర్లు చేయడం ద్వారా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ ఓపెనర్ గా 3వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలినాడు.