
కోహ్లీ ఓ అహంభావి.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరని గట్టిగా చెప్పొచ్చు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. ఎంతో శ్రమించి తిరుగులేని ఆటగాడిగా రికార్డులను సృష్టించాడు.
కోహ్లీ కెరీర్ ఆరంభంలో దూకుడుగా ఉండేవాడు. ఎవరైనా కోహ్లీని కదిలిస్తే ధీటుగా సమాధానం ఇచ్చే దాకా ఊరుకోడు. ఈ స్వభావాన్ని చూసి చాలామంది అతడో గర్విష్టిగా భావించారు.
ఆర్సీబీ తరుపున చాలాకాలం పాటు కోహ్లీతో కలిసి ఆడిన ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లీని మొదట్లో చూసినప్పుడే ఇలాగే పొరబడ్డారు. ఐపీఎల్ ద్వారా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు.
'బోల్డ్ డెయిరీస్' ఎపిసోడ్ సందర్భంగా కోహ్లీని చూడగానే తనకు కలిగిన ఇంప్రెషన్‌ను ఏబీ డివిలియర్స్ బయటపెట్టాడు.
కోహ్లీ
కోహ్లీని దగ్గర నుంచి చూశాక అభిప్రాయం మారింది
కోహ్లీని తొలిసారి చూసినప్పుడు అతడు గడసరి, అహంభావి, పొగరుబోతు అని అనుకున్నానని, అతడి హేయిర్ స్టైల్, నడక బట్టి అలా అనుకున్నానని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
అయితే కోహ్లీ గురించి తెలుసుకున్న తర్వాత తన అభిప్రాయం మారిందని, అతడి పట్ల గౌరవం, కోహ్లీ చాలా గొప్పోడని, మొదట్లో అలా అనిపించినా తర్వాత కోహ్లీ ఎంత ఎదిగినా కాళ్లు నేలమీద ఉండేరకమని తెలియజేశాడు.
అనంతరం విరాట్ కోహ్లీ కలిసి ఆడిన క్రిస్ గేల్ కూడా తన అనుభవాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీలో అద్భుతమైన నైపుణ్యం ఉందని, అతడు సరదాగా డాన్స్ చేసేవాడని క్రిస్ గేల్ కొన్ని విషయాలను పంచుకున్నాడు.