Loading...
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ అవసరమా? హర్షా భోగ్లే సంచలన ప్రశ్న!
15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ అవసరమా? హర్షా భోగ్లే సంచలన ప్రశ్న!

Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ అవసరమా? హర్షా భోగ్లే సంచలన ప్రశ్న!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశీయ క్రికెట్‌లో కీలక బాధ్యతలు అందుకున్నాడు. 2026-27 దేశీయ సీజన్‌లో జరిగే దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేశారు. జట్టుకు వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, అతనికి డిప్యూటీగా వైభవ్ సూర్యవంశీని నియమించారు. ఈ నిర్ణయం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు యువ ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడాన్ని పలువురు స్వాగతిస్తుండగా, మరోవైపు రెడ్‌బాల్ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని ఆటగాడికి ఇంత త్వరగా వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు

హర్షా భోగ్లే కీలక ప్రశ్నలు

ఈ నిర్ణయంపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ రెడ్‌బాల్ జట్టుకు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా నియమించడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటో తెలుసుకోవాలనిపిస్తోంది.

అతడు ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లో 207 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 17.25. అతడి ప్రతిభ అసాధారణమైనదే కానీ, రెడ్‌బాల్ క్రికెట్‌లో ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని భోగ్లే పేర్కొన్నారు.

వైభవ్‌కు ఇప్పుడే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. భోగ్లే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

ఫస్ట్‌క్లాస్‌లో ఇంకా నిరూపించుకోవాల్సిందే

ఐపీఎల్ 2026తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు.

అదే జోరుతో ఈస్ట్ జోన్ జట్టులో స్థానం సంపాదించాడు. అయితే రెడ్‌బాల్ క్రికెట్‌లో అతడికి ఇంకా పెద్దగా అనుభవం లేదు.

ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన వైభవ్ 207 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యధిక స్కోరు 93 పరుగులు.

ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీ అతడికి తన రెడ్‌బాల్ సామర్థ్యాన్ని నిరూపించుకునే కీలక వేదికగా మారనుంది.

ADVERTISEMENT

వివరాలు

ఓపెనర్‌గా బరిలోకి.. బలమైన బౌలింగ్ దళం

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ, భారత ఓపెనర్ 'అభిమన్యు ఈశ్వరన్' తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

ఇక ఈస్ట్ జోన్ బౌలింగ్ విభాగంలో భారత సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, ముఖేశ్ కుమార్ ఉండటం జట్టుకు మరింత బలాన్నిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నమా?

వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వెనుక సెలెక్టర్ల ఆలోచన ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భవిష్యత్ భారత జట్టుకు నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నమా? లేక అతడి అసాధారణ ప్రతిభపై సెలెక్టర్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనమా? అనే చర్చ క్రికెట్ వర్గాల్లో సాగుతోంది.

దులీప్ ట్రోఫీలో వైభవ్ తన బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. బ్యాట్ చేతబట్టినప్పుడు ఈ యువ సంచలనం మరోసారి తన ప్రతిభను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ADVERTISEMENT