LOADING...
Virat Kohli: కోహ్లీకి భద్రత లేదా?..బీసీసీఐ వైఫల్యంపై నెట్టింట విమర్శలు!
కోహ్లీకి భద్రత లేదా?..బీసీసీఐ వైఫల్యంపై నెట్టింట విమర్శలు!

Virat Kohli: కోహ్లీకి భద్రత లేదా?..బీసీసీఐ వైఫల్యంపై నెట్టింట విమర్శలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్‌ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) భద్రతపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కారణం ఏమిటంటే ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించి కోహ్లీని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించడమే. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించినా అభిమానిని మైదానం లోపలికి రాకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యారు.

Details

 రాజీవ్ శుక్లా కామెంట్స్‌పై విమర్శలు

ఈ ఘటనకు సంబంధించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla)సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేస్తూ, ''విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ అద్భుతం'' అని వ్యాఖ్యానించారు. అయితే ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. భద్రతా లోపాన్ని ప్రశంసగా అభివర్ణించడం సరికాదని, ఆటగాళ్ల రక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కామెంట్లు చేస్తున్నారు. అధికారిగా ఉన్న మీరు భద్రతపై దృష్టిపెట్టాలి. ప్రశంసలు కురిపించడం కాదు. BCCI వైస్ ప్రెసిడెంట్‌గా భద్రతా వైఫల్యాన్ని ప్రోత్సహించకూడదు. ప్లేయర్లకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులను నివారించాలని చెబుతున్నారు. గతంలోనూ ఆటగాళ్ల దగ్గరికి అభిమానులు వెళ్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అభిమానులు బీసీసీఐను డిమాండ్ చేస్తున్నారు.