Shubman Gill: శుభ్‌మన్ గిల్‌పై తొందరపాటు తీర్పులు ఇవ్వొద్దు : ఆశిష్ నెహ్రా
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌తో టీ20 ఫార్మాట్‌లోకి మళ్లీ అడుగుపెట్టిన శుభమన్ గిల్ (Shubman Gill) ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లోనూ అతని ప్రదర్శన నిరాశపరుస్తోంది. తొలి మ్యాచ్‌లో నాలుగు పరుగులకే పరిమితమైన గిల్.. రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతని ఫామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నా, భారత మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) మాత్రం గిల్‌కు అండగా నిలిచాడు. కొన్ని పేలవ ప్రదర్శనల ఆధారంగా శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాడిని అంచనా వేయడం సరికాదని నెహ్రా స్పష్టం చేశాడు. అతడు పూర్తిగా రాణించేందుకు ఇంకా సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
Details
వచ్చే మ్యాచులో రాణిస్తారు
'ఐపీఎల్‌కు ముందు గిల్ ఇలాంటి ఫామ్‌లో ఉన్నా నేను అసలు ఆందోళన చెందను. ఎందుకంటే ఇది టీ20 ఫార్మాట్. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌లే ఆడాం. టీ20 క్రికెట్ చాలా వేగంగా సాగుతుంది. ఇందులో తరచూ మార్పులు జరుగుతుంటాయి. అంతర్జాతీయ క్రికెట్ లేదా ఐపీఎల్‌లో రెండు, మూడు మ్యాచ్‌లతోనే శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాళ్లను అంచనా వేయడం చాలా కష్టమని నెహ్రా వ్యాఖ్యానించాడు. అలాగే జట్టులో మార్పులు చేయాల్సి వస్తే టీమిండియాకు అనేక ఆప్షన్లు ఉన్నాయని కూడా పేర్కొన్నాడు. 'ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను తప్పించి సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్‌లతో ఆడించవచ్చు. అది సరిపోకపోతే వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను కూడా ప్రయోగించొచ్చు.
Details
పదే పదే మార్పులు చేయకూడదు
గణాంకాలు బాగా లేవని ఆటగాళ్లను మార్చడం గురించి ఆలోచిస్తే ఎన్నో ఎంపికలు కనిపిస్తాయి. కానీ అలా పదే పదే మార్పులు చేస్తూ వెళ్తే, భవిష్యత్తులో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని నెహ్రా వివరించాడు. ఇదిలా ఉండగా, భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను భారత్ గెలుచుకోగా, రెండో టీ20లో సఫారీలు విజయం సాధించారు. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆదివారం (డిసెంబరు 14) ధర్మశాలలో జరగనుంది.