
CSK vs RCB: 'మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి'.. రిపోర్టర్ ప్రశ్నపై ఫ్లెమింగ్ అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో చైన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి ఎదురైంది. 2008 లీగ్ తర్వాత చెన్నైకి ఇది తమ సొంత మైదానంలో ఆర్సీబీ చేతిలో ఎదురైన పరాజయం. ఈ ఓటమితో సీఎస్కేకి ఈ సీజన్‌లో తొలి పరాజయం నమోదైంది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్న ఆయనకు అసహనాన్ని కలిగించింది. తొలి మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్లో ఛేదించారని, ఇప్పుడు 146 పరుగులే చేశారని, మీ పాతబడిపోయిందని అనిపించడం లేదా అంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. మీ ప్రశ్నలో అర్థం లేదు. తాము మొదటి బంతి నుంచే స్వింగ్ చేయలేదన్నారు.
Details
హోం అడ్వాంటేజ్‌పై ఫ్లెమింగ్ క్లారిటీ
అదృష్టం కూడా కలిసి రావాలని, చివరికి విజేత ఎవరో చూడాలని, తమది పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని, తక్కువగా అంచనా వేయకూడదని బదులిచ్చారు. కొన్ని సంవత్సరాలుగా చెపాక్ స్టేడియం గురించి మాట్లాడుతూనే ఉన్నానని, ఇక్కడ హోం అడ్వాంటేజ్ అనే విషయం ఉండదన్నారు. తాము ఇతర వేదికల్లో కూడా విజయాలు సాధించామని గుర్తు చేశారు. ప్రతి మ్యాచ్ ఒక కొత్త సవాలేనని, పిచ్‌ను అర్థం చేసుకుని సరైన జట్టును ఎంపిక చేయాలన్నారు. అయితే కొన్నిసార్లు అంచనా తప్పు కావొచ్చని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు.