LOADING...
IPL-PSL: క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా.. ఒకే రోజున ఐపీఎల్-పీఎస్ఎల్ ప్రారంభం!
క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా.. ఒకే రోజున ఐపీఎల్-పీఎస్ఎల్ ప్రారంభం!

IPL-PSL: క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా.. ఒకే రోజున ఐపీఎల్-పీఎస్ఎల్ ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌), పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్ఎల్‌) 2026 సీజన్లు ఒకే రోజున ప్రారంభం కానున్నాయి. 'క్రిక్‌బజ్‌' కథనం ప్రకారం, ఈ రెండు ప్రముఖ టీ20 లీగ్‌లు మార్చి 26, 2026 (గురువారం) నుంచి మొదలవుతాయని ఆయా క్రికెట్ బోర్డులు ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారమిచ్చాయి. వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్‌, పీఎస్ఎల్‌లు ఒకే సమయంలో జరగడం విశేషంగా మారింది. ఐపీఎల్‌ సీఈవో హేమంగ్ అమీన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఐపీఎల్‌ 2026 సీజన్‌ మార్చి 26న ఆరంభమై మే 31 (ఆదివారం)న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.

Details

 38 రోజుల పాటు పీఎస్ఎల్‌ 

మరోవైపు పీఎస్ఎల్‌ కూడా అదే రోజున మొదలవుతున్నప్పటికీ, ఈ టోర్నీ వ్యవధి మాత్రం తక్కువగా ఉండనుంది. మొత్తం 38 రోజుల పాటు జరిగే పీఎస్ఎల్‌ మే 3 (శనివారం)న ముగియనుంది. ఈసారి ఐపీఎల్‌ 10 జట్లతో మొత్తం 74 మ్యాచ్‌లతో సుదీర్ఘంగా సాగనుండగా, పీఎస్ఎల్‌ మాత్రం విస్తరణకు సిద్ధమైంది. ఇప్పటివరకు 6 జట్లతో జరిగిన ఈ లీగ్‌ను 2026 నుంచి 8 జట్లకు పెంచనున్నారు. దీంతో ఒకే సమయంలో జరిగే ఈ రెండు లీగ్‌లు అభిమానులకు ఆసక్తికర పోటీనిచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement