
Anvay Dravid: 459 పరుగులతో ద్రవిడ్ కుమారుడు అరుదైన రికార్డు.. కేఎస్‌సీఏ తరుపున సన్మానం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్ మైదానంలో తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నాడు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) వార్షిక అవార్డుల కార్యక్రమంలో అన్వయ్‌కి ప్రత్యేక గౌరవం లభించింది. సీనియర్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు, జూనియర్ కేటగిరీలో రాణించిన అన్వయ్‌ను KSCA సన్మానించింది. అన్వయ్‌కి ఈ అవార్డు లభించడం వెనుక కారణం అతని అద్భుతమైన ప్రదర్శన. రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడి ప్రతిభను గుర్తించి, అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక తరపున అత్యధిక పరుగులు సాధించాడని అభినందించారు.
Details
అత్యధిక పరుగులు సాధించినందుకు సన్మానం
వికెట్ కీపర్-బ్యాటర్‌గా రాణిస్తున్న అన్వయ్, గత సీజన్‌లో తన బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇదే రెండో ఏడాది అతను విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించినందుకు సన్మానం పొందడం విశేషం. అన్వయ్ ఆరు మ్యాచ్‌లలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో 459 పరుగులు చేసి, 91.80 సగటు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 46 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కర్ణాటక తరపున అతను అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే టోర్నమెంట్‌లో అత్యధిక సగటు కూడా అతనికే వచ్చింది. సీనియర్ క్రికెటర్లు కూడా KSCA వార్షిక అవార్డుల కార్యక్రమంలో సన్మానించారు.
Details
నాన్న బాటలో తనయుడు
మయాంక్ అగర్వాల్ : విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున 651 పరుగులు సాధించినందుకు అవార్డు. సగటు: 93. ఆర్. స్మరణ్ : రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 516 పరుగులు సాధించడందుకు అవార్డు. వాసుకి కౌశిక్ : బౌలింగ్ విభాగంలో 23 వికెట్లు సాధించినందుకు సన్మానం. రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లో నడుస్తూ జూనియర్ క్రికెట్‌లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న అన్వయ్, సీనియర్ స్టార్ ప్లేయర్‌తో పాటు అవార్డులు పొందడం ద్వారా భవిష్యత్తులో మరింత ప్రేరణ పొందుతాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.