Page Loader
డుప్లెసిస్ దెబ్బకు స్టేడియం బయటపడిన బంతి.. ఈ సీజన్‌లో భారీ సిక్సర్ ఇదే
భారీ సిక్సర్ కొట్టిన డుప్లెసిస్

డుప్లెసిస్ దెబ్బకు స్టేడియం బయటపడిన బంతి.. ఈ సీజన్‌లో భారీ సిక్సర్ ఇదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్సర్ నమోదైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ రికార్డును సృష్టించాడు. డుప్లెసిస్ దెబ్బకు బంతి స్టేడియం వెలువల పడింది. ఈ మ్యాచ్‌లో అతను 46 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లలో ఒకటి అతి భారీ సిక్సర్ కావడం గమనార్హం. ఇన్నింగ్స్ 15 ఓవర్లో లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగో బంతిని మిడ్ వికెట్ దిశగా డుప్లెసిస్ బలంగా బాదాడు. అది ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఐపీఎల్ లో భారీ సిక్సర్ నమోదైంది. ఆ షాట్ చూసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ షాక్ తిన్నాడు.

ఆర్సీబీ

ఆల్బీ మోర్కల్ మొదటి స్థానం

2008 చైన్నై సూపర్ కింగ్స్ పై ఆల్బీ మోర్కల్ 125 మీటర్ల సిక్సర్‌ను నమోదు చేశాడు. అప్పటి నుండి అత్యంత భారీ సిక్సర్ ఇదే కావడం గమనార్హం. ఆ తర్వాత ప్రవీణ్‌కుమార్ (124 మీటర్లు), గిల్‌క్రిస్ట్ (122), ఉతప్ప (120), క్రిస్‌గేల్ (119), యువరాజ్‌సింగ్ (119) మీటర్ల సిక్సర్లను నమోదు చేసిన ఆటగాళ్లగా నిలిచారు. మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బెంగళూరు 212 పరుగులు చేయగా.. లక్నో చివరి బంతికి విజయం సాధించింది.