
ఓడిపోయిన ఆర్సీబీకి మరోషాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అత్యంత భారీ స్కోరును చేధించి బెంగళూరు జట్టుకు లక్నో షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు డబుల్ షాక్ తగిలింది.
మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు అతనికి రూ.12 లక్షలు జరిమానా విధించారు.
మొదట టాస్ గెలిచి లక్నో బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో లక్నో 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్ని అందుకుంది.
ఆర్సీబీ
ఐపీఎల్‌లో మొదటి తప్పిదం చేసిన ఆర్సీబీ
స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్‌కు జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వహకులు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఓటమి బాధతో ఉన్న ఆర్సీబీకి ప్రస్తుతం పుండుమీద కారం చల్లినట్లు అయింది
ఆర్సీబీకి ఇది తొలి తప్పిదం కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించామని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేయడం విశేషం.
ఆర్సీబీ తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.