Page Loader
ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎలెనా రైబాకినా
ఎలెనా రైబాకినా 2023లో తన మొదటి టైటిల్‌ను గెలుచుకుంది

ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎలెనా రైబాకినా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలైనా రైబాకినా 2023 సీజన్‌లో దుమ్ములేపింది. ఇండియన్ వెల్స్ టైటిళ్లను గెలుచుకొని సత్తా చాటింది. తన కెరీర్‌లో తొలి WTA 1000 టైటిల్‌ను, BNP పారిబాస్ ఓపెన్ ఇండియన్ వెల్స్‌తో ఆమె రికార్డు సృష్టించింది. 10వ ర్యాంక్‌ క్రీడాకారిణి రైబాకినా ఫైనల్‌లో 7-6(11), 6-4తో రెండో సీడ్‌ అరీనా సబలెంకాను చిత్తు చేసింది. రైబాకినా ప్రస్తుతం తన కెరీర్‌లో నాల్గవ WTA సింగిల్స్ టైటిల్స్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. రైబాకినా ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించింది. రైబాకినా మొదటి సర్వ్‌లో 63శాతం విజయం సాధించగా, రెండో సర్వ్‌లో 56శాతం విజయం సాధించింది.

రైబాకినా

గతంలో సబాలెంకాపై ఓడిన రైబాకినా

రైబాకినా 5 ప్రయత్నాలలో సబాలెంకాపై తన తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి ముందు రైబాకినా ఈ ఏడాది 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో సబాకెంకా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆమె 2021 వింబుల్డన్ (R16), 2021 అబుదాబి (క్వార్టర్స్), 2019 వుహాన్ (క్వార్టర్స్)లో ఓటములు చవిచూసింది. రైబాకినా తన చివరి నాలుగు మ్యాచ్‌లలో టాప్ 2-ర్యాంక్ ఆడి గెలవడం గమనార్హం. ఆమె 2022 వింబుల్డన్ ఫైనల్‌లో ఒన్స్ జబీర్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్విటెక్‌ను రెండుసార్లు ఓడించి విజృంభించింది. రైబాకినా 2023లో 16-4 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉంది.