Alyssa Healy Retirement: భారత్ సిరీస్‌తో ముగింపు.. అంతర్జాతీయ క్రికెట్‌కు అలీసా హీలీ వీడ్కోలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు ఊహించని భారీ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్, సీనియర్ వికెట్‌కీపర్-బ్యాటర్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్‌తో జరగనున్న సిరీస్ తన కెరీర్‌లో చివరిదని ఆమె స్పష్టం చేసింది. 16 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ, ఘనమైన క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ వెల్లడించింది. కొన్ని నెలలుగా రిటైర్మెంట్ అంశంపై తీవ్రంగా ఆలోచించినట్లు తెలిపిన హీలీ, ఎన్నో సంవత్సరాలుగా అత్యున్నత స్థాయిలో ఆడిన తర్వాత తనలోని పోటీతత్వం క్రమంగా తగ్గినట్టు అనిపించిందని నిజాయితీగా అంగీకరించింది. మంగళవారం విడుదలైన 'విల్లో టాక్' పోడ్కాస్ట్‌లో 35 ఏళ్ల హీలీ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Details
అంతర్జాతీయ క్రికెట్ లో దాదాపు 300 మ్యాచులు
'భారత్‌తో జరిగే సిరీస్ నా కెరీర్‌లో చివరిదని చెప్పడం చాలా భావోద్వేగంగా ఉంది. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనే తపన ఇంకా నాలో ఉంది. కానీ కెరీర్ ప్రారంభం నుంచి నన్ను ముందుకు నడిపించిన దూకుడు, పోటీ తత్వం ఇప్పుడు కొంత తగ్గింది. అందుకే రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను. ఈ నిర్ణయంపై చాలా ఆలోచించాను. గత కొన్ని సంవత్సరాలుగా శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. ఇంతకు ముందు లాగ శక్తిని తిరిగి తెచ్చుకోవడం ఇప్పుడు కష్టంగా మారిందని హీలీ పేర్కొంది. అలీసా హీలీ తన అంతర్జాతీయ కెరీర్‌ను దాదాపు 300 మ్యాచ్‌లతో ముగించనుంది.
Details
అన్ని ఫార్మాట్లలో కలిపి 7,000కు పైగా పరుగులు
అన్ని ఫార్మాట్లలో కలిపి 7,000కు పైగా పరుగులు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2010లో టీనేజర్‌గా వికెట్‌కీపర్‌గా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన హీలీ, మెగ్ లానింగ్ నాయకత్వంలో చాలా కాలం వైస్ కెప్టెన్‌గా సేవలందించింది. 2023లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. కెప్టెన్‌గా ఆమె సాధించిన ఘనతల్లో ఇంగ్లండ్‌పై 16-0తో చారిత్రక వైట్‌వాష్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన కెరీర్ మొత్తం మీద హీలీ ఎనిమిది ఐసీసీ వరల్డ్‌కప్ విజేత జట్లలో సభ్యురాలిగా నిలిచింది. వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం, మహిళల టీ20 అంతర్జాతీయాల్లో వికెట్‌కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్ సాధించడం వంటి అరుదైన రికార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి.
Details
రెండు సార్లు ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక
2019లో ప్రతిష్టాత్మక బెలిండా క్లార్క్ అవార్డు అందుకున్న హీలీ, రెండు సార్లు ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. అలాగే 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ అనంతరం అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనుంది. ఈ టెస్ట్ మార్చి 6 నుంచి 9 వరకు పెర్త్‌లో జరగనుండగా, సొంత అభిమానుల మధ్య ఘనంగా కెరీర్‌కు ముగింపు పలకాలని హీలీ ఆశిస్తోంది. ఆసక్తికరంగా, రిటైర్మెంట్ ప్రకటనకు కొన్ని నెలల ముందే డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో హీలీకి ఊహించని షాక్ ఎదురైంది.
Details
గాయం కారణంగా సీజన్ కు దూరం
వేలంలో తొలి పేరుగా వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా ఆమెపై బిడ్ వేయలేదు. యాక్సిలరేటెడ్ రౌండ్‌లోనూ అవకాశం దక్కలేదు. డబ్ల్యూపీఎల్ తొలి రెండు సీజన్లలో యూపీ వారియర్జ్ తరఫున ఆడిన హీలీ, గాయం కారణంగా 2025 సీజన్‌కు దూరమైంది. గత 15 ఏళ్లుగా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన అలీసా హీలీ, అత్యంత ప్రభావవంతమైన వికెట్‌కీపర్-బ్యాటర్లలో ఒకరిగా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించనుంది.