LOADING...
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటించిన ఇంగ్లాండ్.. ఆర్చర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!
టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటించిన ఇంగ్లాండ్.. ఆర్చర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటించిన ఇంగ్లాండ్.. ఆర్చర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026 సమయం క్రమంగా దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే దేశాలు తమ తమ జట్లను ప్రకటించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ క్రమంలో తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ టీ20 ప్రపంచకప్‌ జట్టును అధికారికంగా ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే ఈ మెగాటోర్నీలో ఇంగ్లాండ్ జట్టుకు హ్యారీ బ్రూక్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అతడి నాయకత్వంలో ఇంగ్లాండ్ మరోసారి టైటిల్‌పై కన్నేసింది. ఆసక్తికరంగా గాయంతో ఇబ్బంది పడుతున్న పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు కూడా 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది.

Details

 శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు ఆర్చర్ ఎంపిక

అయితే, ఆర్చర్ పూర్తిగా కోలుకోని నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు కూడా చేసింది ఈసీబీ. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆర్చర్‌ను ఎంపిక చేయలేదు. ఈ సిరీస్‌కు అతడి స్థానంలో బ్రైడాన్ కార్స్‌కు అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్‌ సమయానికి ఆర్చర్ ఫిట్‌నెస్ సాధించకపోతే, అతడి స్థానంలో బ్రైడాన్ కార్స్‌నే మెగాటోర్నీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని ఈసీబీ స్పష్టం చేసింది. మొత్తానికి, హ్యారీ బ్రూక్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు పూర్తి స్థాయి ప్రణాళికతో టీ20 ప్రపంచకప్‌ 2026కు సిద్ధమవుతోంది. ఆర్చర్ ఫిట్‌నెస్‌పై ఉన్న ఉత్కంఠే ఇప్పుడు ఇంగ్లాండ్ అభిమానుల్లో ప్రధాన చర్చాంశంగా మారింది.

Advertisement