IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డకెట్..రెండేళ్ల నిషేధం!
ఈ వార్తాకథనం ఏంటి
బ్లెస్సింగ్ ముజరబాని, దాసున్ శానక, స్పెన్సర్ జాన్సన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నుంచి తప్పుకున్నారు. అయితే దీనికి భిన్నంగా, ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ డకెట్ మాత్రం ఐపీఎల్ నుంచే వైదొలగడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టులో చోటు దక్కించుకున్న డకెట్, ఈ ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండబోనని స్పష్టం చేశాడు. గత ఏడాది జరిగిన వేలంలో డీసీ అతడిని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అతని నిర్ణయం జట్టుకు కొంత దెబ్బతీసే అవకాశముంది.
వివరాలు
'అలా చేయడం తప్పే..క్షమించండి'
డకెట్ తన నిర్ణయంపై మాట్లాడుతూ..ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పారు. ఇది చాలా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కెరీర్ దృష్ట్యా అవసరమని, ఐపీఎల్‌లో ఆడటం గొప్ప అవకాశం అయినా, ఇంగ్లాండ్ తరఫున టెస్టు క్రికెట్‌లో మెరుగ్గా రాణించడం తన ముఖ్య లక్ష్యం అని తెలిపాడు. ముఖ్యంగా యాషెస్ సిరీస్‌లో నిరాశ కలిగించిన ప్రదర్శన తరువాత, మానసికంగా, శారీరకంగా మరింత సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, అలాగే యాషెస్ సమయంలో మద్యం సేవించిన విషయంపై తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. అది తప్పు నిర్ణయమని అంగీకరిస్తున్నట్లు వెల్లడించాడు.
వివరాలు
రెండేళ్ల నిషేధం తప్పదా?
ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం, 2025 నుంచి అమలులో ఉన్న కొత్త నియమాలు కఠినంగా మారాయి. వేలంలో ఎంపికైన తర్వాత సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకునే ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు. గాయాలు లేదా వైద్య కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో డకెట్ 2027, 2028 ఐపీఎల్ సీజన్‌లలో కూడా పాల్గొనే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత ఏడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో డకెట్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది. మొత్తం 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 220 పరుగులు మాత్రమే చేయగలిగాడు.