LOADING...
The Ashes 2025-26: బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం 
బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం

The Ashes 2025-26: బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెల్‌బోర్న్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్‌ (బాక్సింగ్‌ డే టెస్ట్‌)లో ఇంగ్లండ్‌ జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ టెస్ట్‌ మ్యాచ్‌ ముగియడం విశేషం. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 32.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలీ 37 (48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ డకెట్‌ 34 (26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి ఆరంభాన్ని అందించారు.

Details

జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జాకబ్ బెథెల్

తొలి వికెట్‌కు ఈ జోడీ కేవలం 42 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత జాకబ్‌ బెథెల్‌ 40 (46 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. బ్రైడన్‌ కార్స్‌ 6, జో రూట్‌ 15, బెన్‌ స్టోక్స్‌ 2 పరుగులకే అవుటై నిరాశపరిచారు. చివర్లో హ్యారీ బ్రూక్‌ 2* (9 బంతుల్లో), జెమ్మీ స్మిత్‌ 3* (2 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌, రిచర్డ్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Details

132 పరుగులకే అలౌట్

అంతకుముందు రెండో రోజు ఆటను 4/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 34.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 42 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్‌కు 175 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌ 46 (67 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్‌ సాధించాడు. స్కాట్‌ బోలాండ్‌ 6, జేక్‌ వెదర్లాడ్‌ 5, లబుషేన్‌ 8, ఉస్మాన్‌ ఖవాజా 0, కామెరూన్‌ గ్రీన్‌ 19, మైఖేల్‌ నీసర్‌ 0, మిచెల్‌ స్టార్క్‌ 0, రిచర్డ్‌సన్‌ 7 పరుగులకే పెవిలియన్‌ చేరారు.

Advertisement

Details

నాలుగు వికెట్లు తీసిన బ్రైడన్ కార్స్

స్టీవ్‌ స్మిత్‌ 24* (39 బంతుల్లో 1 ఫోర్‌) చివరివరకు నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 4 వికెట్లతో మెరిసితే, జోస్‌ టంగ్‌, బెన్‌ స్టోక్స్‌ తలో 2 వికెట్లు, గస్‌ అట్కిన్సన్‌ 1 వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో 20 వికెట్లు, రెండో రోజు మరో 16 వికెట్లు పడగా, మొత్తం మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఏ బ్యాటర్‌ కూడా హాఫ్‌ సెంచరీ నమోదు చేయలేకపోవడం గమనార్హం.

Advertisement