Page Loader
Wayne Larkins: 86 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
86 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత

Wayne Larkins: 86 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత ఇంగ్లిష్ క్రికెటర్ వేన్ లార్కిన్స్ (Wayne Larkins) 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. క్రీడా ప్రపంచంలో 'నెడ్‌'గా ప్రఖ్యాతి పొందిన లార్కిన్స్ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా తుదిశ్వాస విడిచారు. ఆయన 1953 నవంబర్ 22న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాక్స్టన్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. లార్కిన్స్ 1979 నుండి 1991 మధ్య కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున 13 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. టెస్టు క్రికెట్‌లో 25 ఇన్నింగ్స్‌లలో 20.54 సగటుతో 493 పరుగులు చేయగా, వన్డేల్లో 24 ఇన్నింగ్స్‌లలో 24.62 సగటుతో 591 పరుగులు సాధించారు. ఆయన టెస్టుల్లో మూడు హాఫ్ సెంచరీలు, వన్డేల్లో ఒక సెంచరీతో ఆకట్టుకున్నారు.

Details

పలువురు ప్రముఖుల సంతాపం

ఇంగ్లండ్ జట్టుకే కాకుండా, దేశీయ క్రికెట్‌ ప్రతినిధిగా నార్తాంప్టన్‌షైర్, డర్హామ్, బెడ్‌ఫోర్డ్‌షైర్‌లకు ఆయన సేవలందించారు. మొత్తం 482 ఫస్ట్ క్లాస్, 485 లిస్ట్ A మ్యాచ్‌లలో పాల్గొన్న లార్కిన్స్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 842 ఇన్నింగ్స్‌లలో 34.44 సగటుతో 27,142 పరుగులు చేశారు. అదే సమయంలో, లిస్ట్ A క్రికెట్‌లో 467 ఇన్నింగ్స్‌లలో 30.75 సగటుతో 13,594 పరుగులు నమోదు చేశారు. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన లార్కిన్స్, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 59 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీలు చేయగా, లిస్ట్ A క్రికెట్‌లో 26 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు చేశారు.

Details

లార్కిన్స్ మరణం క్రికెట్ ప్రపంచానికి తీరనిలోటు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 252 పరుగులు కాగా, లిస్ట్ Aలో 172 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కలిపి, లార్కిన్స్ 1358 ఇన్నింగ్స్‌లలో మొత్తం 41,820 పరుగులు చేశాడు. ఈ ప్రయాణంలో ఆయన మొత్తం 86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన లార్కిన్స్ మరణం క్రికెట్ ప్రపంచానికి తీరనిలోటుగా నిలిచింది.