Loading...
FIFA World Cup 2026: ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌.. తొలిసారి ప్రపంచకప్‌ కాంస్య పతకం సొంతం!
ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌.. తొలిసారి ప్రపంచకప్‌ కాంస్య పతకం సొంతం!

FIFA World Cup 2026: ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌.. తొలిసారి ప్రపంచకప్‌ కాంస్య పతకం సొంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మూడో స్థానం కోసం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఫ్రాన్స్‌ను 6-4 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. నాకౌట్ దశలో ఒకే మ్యాచ్‌లో మొత్తం 10 గోల్స్ నమోదవడం వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విజయంతో ప్రపంచకప్‌లో తొలిసారిగా కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఇంగ్లాండ్, 1966లో ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత మళ్లీ ప్రపంచకప్ పతకాన్ని అందుకుంది.

వివరాలు

ఆరంభం నుంచే ఇంగ్లాండ్ దూకుడు

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని చాటింది. మూడో నిమిషంలో డెక్లాన్ రైస్ తొలి గోల్ చేసి జట్టుకు లీడ్ అందించాడు.

అనంతరం 18వ నిమిషంలో ఎజ్రి కొన్సా మరో గోల్ నమోదు చేశాడు. బుకాయో సకా 37వ నిమిషంలో ఒకటి, తొలిార్థం అదనపు సమయంలో (45+1) మరో గోల్ కొట్టడంతో హాఫ్‌టైమ్ నాటికి ఇంగ్లాండ్ 4-0 ఆధిక్యంలో నిలిచింది.

రెండోభాగంలో ఫ్రాన్స్ అద్భుతంగా పుంజుకుంది. 48వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాపె గోల్ చేసి జట్టుకు ఆశలు రేకెత్తించాడు.

ఆ తర్వాత 54వ నిమిషంలో బ్రాడ్లే బార్కోలా గోల్ చేయగా, 66వ నిమిషంలో ఎంబాపె మరోసారి బంతిని నెట్‌లోకి పంపడంతో స్కోరు 4-3కు చేరి మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.

వివరాలు

సకా హ్యాట్రిక్.. బెల్లింగ్‌హామ్ చివరి ముద్ర

మ్యాచ్ చివరి దశలో ఇంగ్లాండ్ మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది.

87వ నిమిషంలో లభించిన పెనాల్టీని బుకాయో సకా విజయవంతంగా గోల్‌గా మలిచి తన హ్యాట్రిక్‌ను పూర్తి చేయడంతో ఇంగ్లాండ్ 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది.

అదనపు సమయంలో 90+6వ నిమిషంలో ఔస్మాన్ డెంబెలె ఫ్రాన్స్‌కు నాలుగో గోల్ అందించినా, వెంటనే 90+8వ నిమిషంలో జూడ్ బెల్లింగ్‌హామ్ గోల్ చేసి ఇంగ్లాండ్ విజయాన్ని 6-4తో ఖరారు చేశాడు.

ADVERTISEMENT

వివరాలు

పరాజయంలోనూ ఎంబాపె రికార్డు

ఫ్రాన్స్ ఓటమిపాలైనప్పటికీ కిలియన్ ఎంబాపె వ్యక్తిగతంగా మరో అరుదైన ఘనత సాధించాడు.

వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచి కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 22 గోల్స్ ఉన్నాయి.

ఈ జాబితాలో లియోనెల్ మెస్సి 21 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఫైనల్‌లో మెస్సి రెండు గోల్స్ సాధిస్తే ఈ రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

ఈ వరల్డ్‌కప్‌లో గోల్డెన్ బూట్ పోరులో కూడా ఎంబాపె అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 10 గోల్స్ చేయడంతో పాటు నాలుగు అసిస్ట్స్ అందించాడు.

మెస్సి ఎనిమిది గోల్స్ చేసి నాలుగు అసిస్ట్స్ నమోదు చేశాడు. దీంతో గోల్డెన్ బూట్ రేసు ఫైనల్ వరకు ఉత్కంఠగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT