Page Loader
IND vs ENG: మూడో టెస్ట్ ముందు అబుదాబీకి ఇంగ్లండ్ జట్టు.. ఎందుకంటే..? 
మూడో టెస్ట్ ముందు అబుదాబీకి ఇంగ్లండ్ జట్టు.. ఎందుకంటే..?

IND vs ENG: మూడో టెస్ట్ ముందు అబుదాబీకి ఇంగ్లండ్ జట్టు.. ఎందుకంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2024
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ పై టీమిండియా 106 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ప్రారంభవుతుంది.అయితే,మూడవ టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు అబుదాబికి వెళ్లనుంది. ఇక మూడో టెస్ట్ కి 10రోజుల సమయం ఉండడంతో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీం విశ్రాంతి కోసం అబుదాబికి వెళ్లనుంది. అదే సమయంలో ఇంగ్లండ్‌ టీమ్ ప్లేయర్స్ కుటంబసభ్యులు కూడా అబుదాబికి చేరుకోనున్నట్లు సమాచారం. అబుదాబిలో విశ్రాంతి అనంతరం మూడో టెస్టు కోసం ఇంగ్లండ్‌ జట్టు ప్రాక్టీస్‌ చేస్తుంది. ఇక మూడో టెస్ట్ కి రెండు రోజుల ముందు ఇంగ్లండ్ జట్టు నేరుగా జైపూర్ చేరుకుంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అబుదాబీకి ఇంగ్లండ్ జట్టు