గాయాలపై పోరాటం చేయలేకపోయా : షాహీన్ ఆఫ్రిది
ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్‌గా షామీన్ ఆఫ్రిదికి పేరుంది. యార్కర్లతో ప్రత్యర్థులకు బోల్తా కొట్టించే సత్తా ఆఫ్రిదికి ఉంది. అద్భుత బౌలింగ్ ఫెర్ఫామెన్స్‌తో పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్రిది 25 టెస్టులు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ పేస్ యూనిట్‌కు "వెన్నెముక" అని పిలవబడే షాహీన్ మోకాలి గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. దీంతో అతను ఆసియా కప్ 2022 నుండి నిష్క్రమించాడు. నెలల తరబడి శస్త్రచికిత్స, పునరావాసం తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎడిషన్‌తో మైదానంలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
టీ20ల్లో 58 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిది
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గాయాలపై షాహీన్ ఆఫ్రిది స్పందించాడు. తాను క్రికెట్ వదిలేయాలని అనుకున్నానని, అయితే తన పాత వీడియోలను చూడటం ద్వారా మళ్లీ మైదానంలోకి రావాలని అనిపించిందన్నారు. గాయం కారణంగా ఒక ఫాస్ట్ బౌలర్ క్రికెట్ కు దూరంగా చాలా బాధగా ఉందని షాహీన్ ఆఫ్రిది పేర్కొన్నారు. షాహీన్ 32 వన్డేలు ఆడి 62 వికెట్లు పడగొట్టాడు. 47 టీ20ల్లో 58 వికెట్లు తీసి సత్తా చాటాడు. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌తో తలపడనున్న లాహోర్ ఖలందర్స్‌కు షాహీన్ నాయకత్వం వహించనున్నాడు.